![]() |
![]() |
.webp)
శ్రీవాణి అంటే చాలు బుల్లితెర నటిగా యాంకర్ గా అందరికీ పరిచయమే..రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. "మా టీవీలో "నిన్ను కోరి", జీ తెలుగులో "లక్ష్మి రావే మా ఇంటికి" అనే సీరియల్స్ చేస్తున్నాను. ఇవే కాకుండా నాది, మావారిది, మా అమ్మాయి యూట్యూబ్ ఛానెల్స్ , మా ఇన్స్టాగ్రామ్స్ అలాగే మా అమ్మాయి ఢీ ప్రోగ్రాం, మా వారు జెమినీలో నటిస్తున్న "మా ఇంటి దేవత" సీరియల్ తో 35 యూట్యూబ్ ఛానెల్స్ ని మెయింటైన్ చేస్తున్నాం. "కరోనా టైములో పని పాట లేక యూట్యూబ్ ఛానెల్స్ పెట్టాం.
యూట్యూబ్ లో ఫస్ట్ నాకు 10 వేలు వచ్చింది. తర్వాత నెలన్నరకు 30 లక్షలు తీసుకున్నా. నేను కూడా చాల ఆనందపడ్డాను. ఎన్ని డైలీ సీరియల్స్ చేస్తే ఎంత జమ చేస్తే ఇంత నాకు అవుతుంది అనుకున్నాను. వేలకువేలు ఎపిసోడ్స్ చేసాను కానీ ఇంత ఎప్పుడూ ఒక్కసారిగా చూడలేదు. అందుకే యూట్యూబ్ లో ఎంత వచ్చినా నేను సీరియల్స్ చేయడం మానలేదు. అప్పుడు యూట్యూబ్ లో వచ్చినంత అమౌంట్ ఇప్పుడు మాత్రం రావడం లేదు. కొత్త ఛానెల్స్ వచ్చాయి, కొత్త కంటెంట్ వస్తోంది వాళ్లందరికీ హ్యాట్సాఫ్. సీరియల్స్ లో వేసుకునేవి చూసి అదంతా బంగారం అని అనుకోవద్దు. ఆస్తులన్నీ లోన్స్ మీదనే ఉన్నాయి. లోన్ లేకుండా ఒక ఇల్లు ఉండాలని ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. మా మావయ్యగారిది ఒక రెండెకరాల స్థలం ఉంది. అందులో మాకు 300 గజాలు ఉంది. అలా రాజనందిని గార్డెన్స్ అని దాని పేరు ఒకటి ఉంటుంది కదా అని ఒక కొత్త ఇల్లు కడుతున్నాం." అని చెప్పింది.
![]() |
![]() |